ETV Bharat / state

జల్ జీవన్ మిషన్​కు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం - కేంద్ర ప్రభుత్వ పథకం జేజేఎం

Jal Jeevan Mission : రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో జల్​ జీవన్‌ మిషన్‌ పనులు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. రాష్ట్ర వాటా కోసం బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇచ్చినా.. నిధులు మాత్రం విడుదలవడం లేదు. నాలుగేళ్లలో 16 వందల 50 కోట్లకు బీఆర్వోలు ఇచ్చిన ప్రభుత్వం... కేవలం 565 కోట్లే విడుదల చేసింది. గుత్తేదారులు పనులు పూర్తి చేసినా.. ఇంకా వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో.. వారు పనులు నిలిపేశారు. దీనికి ఫలితంగా 2024 మార్చి నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న కేంద్ర సర్కార్ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.

జల్ జీవన్ మిషన్​
జల్ జీవన్ మిషన్​
author img

By

Published : Feb 20, 2023, 7:47 AM IST

జల్ జీవన్ మిషన్​కు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Jal Jeevan Mission : కేెంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జల్ జీవన్ మిషన్ - జేజేఎం కింద రాష్ట్రంలో 78వేల 366 పనులు పూర్తిచేసి గ్రామీణులకు మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 16 వేల 216 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు సమకూర్చాలని ఒప్పందం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నా... రాష్ట్ర వాటా నిధులు ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15 వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేశారు. కానీ ప్రభుత్వ వాటా నిధులు సక్రమంగా విడుదల చేయనందున... గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదు. దీనివల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పలు జిల్లాల్లో పనులు ప్రారంభించినా.. అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంటోంది.

బాపట్ల జిల్లాలో తొలి విడత 205 కోట్ల 22 లక్షలతో 723 పనులు ప్రారంభించారు. ఇందులో ఇప్పటివరకు 189 పనులే పూర్తిచేశారు. గుంటూరు జిల్లాలో 98 కోట్లతో చేపట్టిన 308 పనుల్లో ఇప్పటికీ 50శాతం పూర్తికాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో రెండు విడతల్లో మంజూరైన 12వందల 27 పనుల్లో 115 పూర్తయ్యాయి. 5కోట్ల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నందున... మిగతా పనులు పూర్తి చేయడంపై గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. 4మండలాల్లో 46 పనులకు రెండుమూడు సార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. విజయనగరం జిల్లాలో మంజూరైన 11 వందల 11 పనుల్లో 630 మాత్రమే పూర్తయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామాల్లో ఇళ్లకు ఇస్తున్న కుళాయి కనెక్షన్లు... అనేక చోట్ల అలంకారప్రాయంగా మారాయి. కుళాయిల ద్వారా నీళ్లు ఇవ్వాలంటే వాటర్‌హెడ్‌ ట్యాంకులు, మోటార్లు, పైపులైన్లు వేయాలి. అనేక ప్రాంతాల్లో ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా.. మిగిలిన పనులు ప్రారంభించలేదు. గుత్తేదారులు పనుల నిర్వహణకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. వాటర్‌హెడ్‌ ట్యాంకులున్న చోట నిల్వ సామర్థ్యం పెంపు, అదనపు పైపులైన్లు వేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల కుళాయి కనెక్షన్లు ఇచ్చినా... ఇళ్లకు నీరు సరఫరా కావడం లేదు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.