ETV Bharat / state

ఏడాదిలోపే ఎన్నికలు.. ప్రతీనెలా 20 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలి..: సీఎం జగన్​ - సీఎం జగన్ భేటీ వార్తలు

CM JAGAN MEET WITH MLAS ON GADAPA GADAPAKU MANA PRABHUTWAM: ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం'పై నేడు తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు హాజరు కాగా.. పలువురు ముఖ్యమైన మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీంతో ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు సమావేశానికి హాజరుకాలేదన్న అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

CM JAGAN
CM JAGAN
author img

By

Published : Apr 3, 2023, 10:26 AM IST

Updated : Apr 3, 2023, 2:49 PM IST

CM JAGAN MEET WITH MLAS ON GADAPA GADAPAKU MANA PRABHUTWAM: ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం'పై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతోపాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, ముఖ్య నేతలు హాజరు కాగా.. పలువురు ముఖ్యమైన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు. దీంతో ఆ ఎమ్మెల్యేలు సమావేశానికి ఎందుకు హాజరుకాలేదు?, కారణం ఏంటి? అనే తదితర అంశాలపై సందిగ్ధత నెలకొంది.

సమావేశానికి ముఖ్య నేతలు గైర్హాజర్: వివరాల్లోకి వెళ్తే.. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో నియోజకవర్గ సమన్వయ కర్తలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. అందులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంపై, భవిష్యత్ కార్యాచరణపై, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమాల గురించి నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ సమావేశానికి పలువురు ముఖ్యమైన ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

ఆరోగ్య కారణాలు - వ్యక్తిగత కారణాలు: సీఎం జగన్ తాడేపల్లిలో నిర్వహించిన సమావేశానికి.. మంత్రులు ధర్మాన కృష్ణ ప్రసాదరావు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వైద్యాశాఖ మంత్రి విడదల రజినిలు హాజరు కాలేదు. వీరితోపాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, నవాజ్ బాషా, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, ఎమ్మెల్యే వంశీ, ఆళ్ళ నాని తదితరులు కూడా హాజరు కాలేదు. అందుక్కారణం ఆరోగ్య కారణాలతో పాటు, వ్యక్తిగత కారణాల కారణంగా సమావేశానికి హాజరుకాలేకపోయారని ఆయా ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందించినట్లు సమాచారం.

ఏడాదిలోగా ఎన్నికలు - సిద్దకండి: ఇక, సమావేశంలో చర్చించిన అంశాల విషయానికొస్తే.. సెప్టెంబర్ నాటికి గడప గడపకు, ఇతర కార్యక్రమాలు పూర్తిచేయాలని ఎమ్మెల్యేలను సీఎం జగన్​మోహన్​రెడ్డి ఆదేశించారు. ఏడాదిలోగా ఎన్నికలు ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్‌..ఇక నుంచి ప్రతి నెలలో 20 రోజులపాటు ప్రజల్లోనే ఉండాలని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఎమ్మెల్యే పార్టీ పరంగా, ప్రభుత్వ సేవల పరంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు: తమ పార్టీ అధినేత జగన్.. గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్షిస్తారని, ఎవ్వరిదైనా గ్రాఫ్ బాగోపోతే ముందే వారికి తప్పుకోవాలని చెపుతారని.. మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ అధికారంలోకి వస్తే వారికి ప్రాధాన్యం ఇస్తామని సీఎం జగన్ ముఖం మీదే చెపుతారన్నారని రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే, ఈరోజు జరిగిన సమావేశంలో 'మీకు సీటు లేదని ఎవ్వరికి చెపుతారు అనుకోవడం లేదు' అని మంత్రి అన్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు అనే సమాచారం తన వద్ద లేదని తెలిపారు. అలాంటి మార్పులు ఇప్పుడు ఉంటాయని అనుకోవడం లేదన్నారు. ఈనెల 7 నుండి జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని.. దీనిపైనా గడప గడపలో చర్చ ఉంటుందని అంబటి రాంబాబు తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 3, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.