ETV Bharat / state

సర్పంచుల నిధుల మళ్ళింపుపై మండిపడిన అఖిలపక్షం.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక - సర్పంచ్‌ల అఖిలపక్ష సమావేశం

Sarpanchs All Party Meet : గ్రామాల సమస్యలపై పంచాయతీ రాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సర్పంచ్‌ల ఖాతాల్లో తిరిగి జమ చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సర్పంచ్‌ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. నిధులు మళ్లించి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

Sarpanch
సర్పంచ్
author img

By

Published : Jan 23, 2023, 9:47 PM IST

Sarpanchs All Party Meet: గ్రామాల సమస్యలపై పంచాయతీ రాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశo నిర్వహించారు. కేంద్ర పంపిన 8660 కోట్ల రూపాయలు తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సర్పంచ్‌ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు తెలిపారు. పంచాయతీల నిధుల మళ్లింపు సామాజిక సమస్యగా భావిస్తున్నామన్న ఆయన సర్పంచ్ ల పోరాటానికి భాజపా మద్దతిచ్చి వారి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు మళ్లించి పంచాయితీల వ్యవస్థను నిర్వీర్యం చేయటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సర్పంచ్ లహక్కుల్ని కాలరాయటం వల్ల వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని సర్పంచ్ ల పక్షాన గట్టిగా నిలబడితేనే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు.

సర్పంచ్ లుగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల వారేనని జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ అన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సర్పంచ్ ల హక్కుల కోసం జై భీమ్ పార్టీ తరఫున పోరాడతామని తెలిపారు.

సర్పంచ్ ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకూడదు. సర్పంచ్ ఇండిపెండెంట్​గా ఉండాలి. సర్పంచ్ ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లె పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో డైరెక్టుగా సర్పంచ్ ఖాతాలో నిధులు జమచేసే పరిస్థితిని తీసుకొచ్చింది నరేంద్రమోదీ. 14 ఆర్థిక సంఘం అయిన తర్వాత 15 ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మన దగ్గర నుంచి కరెంట్ బిల్లులను 15 ఆర్థిక సంఘంలో తీసుకోవడం జరిగింది. కరెంట్ బిల్లులని ప్రతి గ్రామం నుంచి కూడా 30 లక్షలు 35 లక్షలు తీసుకోవడం జరిగింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితికి ఈ రోజు మనం వచ్చాం.- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

స్థానికంగా ఉండి పనిచేయలంటే దానికి కచ్చితంగా అక్కడ నిధులుండాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా వారు డైవర్ట్ చేశారంటే మరి ఎంత లెక్కలేనితనం ఉందో అందరికి అర్థమౌతుంది.12918 గ్రామ పంచాయతీలు మరి ఇంత మంది సర్పంచ్​లు ఇంత మంది వార్డు మెంబర్లు ఇవాళ నువేం చేస్తున్నవ్ పారలాల్​గా ఇద్దరిని వేరుచేసి సెక్రటేరియట్లను పెట్టి సర్పంచులకు సంబంధం లేదని మరి సర్పంచులు ఏం చేయాలి.-రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఊళ్లోకి వెళ్తే పక్కనునటువంటి వ్యక్తి, ఒక చిన్న పిల్లవాడు కూడ గౌరవించడు. ఎందుకూ అంటే మీ దగ్గర ఒక లైటు పెట్టే అవకాశం లేదు, ఓ రోడ్డు వేసే అవకాశం లేదు, ఒక డ్రైనేజ్ వేయించే అవకాశం లేదు. మీ వల్ల ఉపయోగం ఏంటయ్యా.. ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఇంకా.. దుర్మార్గంగా మాట్లాడాలంటే మీకింద పనిచేసే సెక్రటరియే మీ కంటే పవర్​ ఫుల్​గా తయారైపోయాడు. మాకున్న చిన్నపాటి అవకాశం హైకోర్టులో కేసులు వాదించలం రాజ్యాంగ పరంగా మీకు ఏ విధంగా న్యాయ సహకార చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ జీవో నం. 123 ని అతి త్వరలో కొట్టేయించేసి మీకు కానుకగా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాం.-జడ శ్రావణ్, జై భీమ్ పార్టీ అధ్యక్షులు

సర్పంచుల నిధులపై సమావేశం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.