Abhaya Gold Properties Stolen : ప్రకాశం జిల్లా శింగరాయకొండకు చెందిన కూకట్ల శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేంద్రంగా తన బంధువులతో కలసి అభయ గోల్డ్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు. రోజువారీ, వారం, నెల, వార్షిక డిపాజిట్ల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. అధిక వడ్డీ, ప్లాట్లు ఇస్తానని నమ్మించాడు. వసూలు చేసిన డబ్బునంతా సొంత ఆస్తులు కూడబెట్టుకుని డిపాజిట్‌దార్లకు మొండిచేయి చూపాడు. 2013లో పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అభయ గోల్డ్, దాని అనుబంధ సంస్థలపై వివిధ స్టేషన్లలో 20 కేసులు నమోదయ్యాయి.
Vijayawada Abhaya Gold Properties Missing in Police Custody : ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా విస్తరించిన ఆర్థిక నేరం కావడంతో దర్యాప్తు బాధ్యతలను విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం చేపట్టింది. ఈ కుంభకోణం విలువ 130 కోట్ల రూపాయలుగా సీఐడీ తేల్చింది. డిపాజిట్‌దారుల రక్షణార్థం సంస్థకు చెందిన పలు ఆస్తులను సీఐడీ అధికారులు గుర్తించి కోర్టు ద్వారా అటాచ్‌మెంట్ చేశారు. ఈ మేరకు ఎనిమిదేళ్ల క్రితం అప్పట్లో హోం శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Thieves Targeted 3 Houses : కదిరిలో రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రాత్రిలో మూడు ఇళ్లలో చోరీ
Theft in Vijayawada : దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు సీజ్ చేసిన పలు వస్తువులను విజయవాడ ఏలూరు రోడ్డులోని అభయ గోల్డ్ కార్యాలయంలో ఉంచి 2013 ఆగస్టులో సీల్ వేశారు. ఆ వస్తువుల్లో వాహనాలు, కార్యాలయ సామగ్రి, వెండి పళ్లాలు, వెండి గ్లాసులు, వెండి పూజా సామగ్రి, తదితర వస్తువులు ఉన్నట్లు తెలిసింది. వాహనాలను నగరంలోని సూర్యారావుపేట స్టేషన్ ఆవరణలో ఉంచారు. డిపాజిట్‌దారుల ప్రయోజనాల దృష్ట్యా స్వాధీనం చేసుకున్న చరాస్తులను బహిరంగ వేలం వేయాలని 2018, అక్టోబరు 29 విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Abhaya Gold Properties Missing in CID Custody : ఇటీవల ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు ఇటీవల విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులోని అభయ గోల్డ్ కార్యాలయాన్ని పరిశీలించారు. సీజ్ చేసిన వస్తువులు మాయం అయినట్లు గుర్తించారు. తర్వాత సూర్యారావుపేట స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉంచిన వాహనాలను పరిశీలించగా కారు, బైక్ కనిపించడం లేదని గుర్తించారు.
ఈ విషయంపై స్టేషన్‌లోని సిబ్బందిని అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. సీఐడీ, పోలీసుల ఆధీనంలోనివే మాయం కావడంతో బయటకు పొక్కకుండా తొక్కి పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సూర్యారావుపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఐడీ అధికారులు సీజ్ చేసిన వస్తువులు ఎప్పుడు, ఎలా మాయమయ్యాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.