14th Day Anganwadi Protest in Vijayawada : ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విజయవాడలో 14వ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగించారు. క్రిస్మస్ పండుగ రోజూ ఆందోళనకు విరామం ఇవ్వకుండా దీక్షా శిబిరం వద్దే క్రిస్మస్ కేక్ కట్ చేసి నిరనస తెలిపారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. పండుగ రోజూ అంగన్వాడీలను రోడ్డుపై కూర్చోబెట్టిన ఘనత జగన్‌కే దక్కిందని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. సమస్య పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
'హామీలు నెరవేర్చే వరకు వెనకడుగు వేసేదేలేదు' - తొమ్మిదో రోజుకు చేరిన అంగన్వాడీల ఆందోళన
14th Day Anganwadi Protest in Prakasam : ప్రకాశం జిల్లా కనిగిరి ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన దీక్షలు కొనసాగించారు. వీరికి మద్దతుగా చిన్నారులు సైతం దీక్షలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేయడంతో తమకు పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందడం లేదని చిన్నారులు వాపోయారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా చేశారు. ప్రభుత్వం సంప్రదింపులు జరపకపోగా ఉద్యమాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని దీక్షా శిబిరంలోనే పిండి వంటలు చేశారు. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలంతా ఏసుక్రీస్తు విగ్రహం వద్ద మొరపెట్టుకున్నారు.
ఇచ్చిన హామీలే అడుగుతున్నాం - అధికారంలోకి వచ్చి మర్చిపోతే ఎలా?: ఎస్ఎస్ఏ ఉద్యోగులు
Anganwadi Protest 14th Day in Srikakulam : శ్రీకాకుళంలో ICDS (Integrated Child Development Services) కార్యాలయం వద్ద శిలువ వేసిన ఏసుక్రీస్తు ఆకారంలో నిరసన తెలిపారు. దీక్షా శిబిరంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బ్లాక్ కేక్ కట్ చేసి నిరసన తెలిపారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంగన్వాడీలు కేక్ కట్ చేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళనలు కొనసాగించారు. మేరీమాత విగ్రహం వద్ద క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
కదం తొక్కుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు - రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు
Christmas Day Anganwadi Protest : రాయలసీమ వ్యాప్తంగానూ అంగన్వాడీల సమ్మె ఉద్ధృతంగా సాగింది. కర్నూలులో అంగన్వాడీ కార్యకర్తలు కళ్లు, చెవులు, నోరు మూసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నంద్యాలలో గడ్డి తింటూ అంగన్వాడీలు ఆందోళన తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దీక్షా శిబిరం వద్దే క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పండగ రోజు కూడా తమకు నిరాశే మిగిల్చిందని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆవేదన చెందారు.
అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు - వినూత్న కార్యక్రమాలు చేపట్టిన రైతులు, మహిళలు