ETV Bharat / state

శ్రీశైలంలో వైభవంగా కార్తికమాస ఉత్సవాలు.. కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం

Laksha Deepostavam At Srisailam : శ్రీశైల మహా క్షేత్రంలో కార్తికమాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కార్తికమాసం చివరి సోమవారం సందర్భంగా.. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నులవిందుగా సాగింది.

Lakshya Deepostavam
Lakshya Deepostavam
author img

By

Published : Nov 22, 2022, 12:36 PM IST

కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం

Laksha Deepostavam : శ్రీశైల మహాక్షేత్రంలో కార్తికమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చివరి కార్తిక సోమవారం సందర్భంగా శ్రీశైలంలోని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్ద వేదికపై కొలువు తీర్చారు.

Laksha Deepostavam At Srisailam
కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం
Laksha Deepostavam At Srisailam
కన్నుల పండుగగా లక్ష దీపోత్సవం

దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో లవన్న దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి పూజలకు శ్రీకారం చుట్టారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు మంగళహారతులతో పూజలు నిర్వహించారు. దశవిధ హారతులను సమర్పించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు దశవిధహారతులు సమర్పిస్తుండగా , భక్తులు ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపారాధన నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.