ETV Bharat / state

డోన్​లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు - డోన్​లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభోత్సవం

నంద్యాల జిల్లా డోన్​ ప్రాంత ప్రజల డోన్ ప్రాంత ప్రజలకు చిరకాల స్వప్నం ఫలించింది. డోన్​లో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు హైకోర్టు న్యాయమూర్తులు.. నూతన భవనాన్ని ప్రారంభించి కోర్టు కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.

court building opened in nandyala
court building opened in nandyala
author img

By

Published : May 8, 2022, 5:04 AM IST

నంద్యాల జిల్లా డోన్ ప్రాంత ప్రజలు, న్యాయవాదుల 40 ఏళ్ల చిరకాల కళ నెరవేరింది. డోన్​లో శనివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా.. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్.గంగారావు, జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి, కర్నూలు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ కృపాకర్ హాజరయ్యారు. అక్కడి ఏర్పాటు చేసిన నూతన భవనాన్ని ప్రారంభించి కోర్టు కార్యకలాపాలను ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తరువాత డోన్​ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
డోన్ ప్రాంత ప్రజలకు చిరకాల స్వప్నం ఫలించిందని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫలితంగా న్యాయం కోసం సుదూర ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. పట్టుదల, ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. డోన్ మండలం యాపదిన్నె గ్రామం ఆయన స్వస్థలం. స్థానిక ప్రజలకు సత్వరంగా.. సకాలంలో స్వచ్ఛమైన న్యాయం అదించాలని న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు సూచించారు. అలాగే న్యాయవాదులు కేవలం డబ్బుల కోసమే కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా పాటుపడాలన్నారు.

న్యాయమూర్తి గంగారావుది స్వస్థలం గుంతకల్లు. ఈయన తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్లులో విద్య అభ్యసించారు. అక్కడ పనిచేసిన గురువులు, స్నేహితులు.. సభకు వచ్చారు. గురువుల రాకతో హర్షం వ్యక్తం చేసిన ఆయన.. వారిని సన్మానం చేసి కాళ్లకు నమస్కరించారు. అలాగే.. 30 ఏళ్లుగా డోన్ కోర్టులో పనిచేస్తున్న సీనియర్ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సన్మానం చేశారు. అనంతరం డోన్ కోర్ట్ బార్ అసోసియేషన్ తరఫున ముగ్గురు న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు.

ఇదీ చదవండి: లోకో పైలట్ సాహసం.. రైల్వే మంత్రి ప్రశంసల వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.