ETV Bharat / state

ప్రజాసమస్యలు పరిష్కరించట్లేదని.. వైకాపా కార్పొరేటర్ నిరసన

author img

By

Published : Dec 29, 2021, 6:51 PM IST

కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ఉత్కంఠగా మారింది. తమ వార్డుల్లో పనులు జరగడం లేదని.. అధికార పార్టీ కార్పొరేటర్ నిరసన తెలిపారు. సంవత్సరం గడిచినా.. వార్డులో ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని.. ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

ysrcp corporators protest at kurnool Municipal Corporation Plenary Meeting
ప్రజా సమస్యలు పరిష్కారం కావటం లేదంటూ.. వైకాపా కార్పొరేటర్ నిరసన

కర్నూలులో ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదంటూ.. కౌన్సిల్ సమావేశంలో అధికార వైకాపా కార్పొరేటర్‌ నిరసనకు దిగారు. కౌన్సిల్ ఏర్పడి నెలలు గడుస్తున్నా.. ఒక్క పనీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ప్రజలకు ఏం చెప్పాలంటూ.. 43వ డివిజన్ కార్పొరేటర్ మునెమ్మ అధికారులను నిలదీశారు.

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మేయర్ డి.వై.రామయ్య నచ్చజెప్పినా వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా.. కౌన్సిల్‌లో నేలపై బైఠాయించారు.

ఇదీ చదవండి:

Dhulipalla Fires On CM Jagan : రూపాయి పెట్టుబడి పెట్టని అమూల్​తో.. రాష్ట్రానికి అప్పులే : ధూళిపాళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.