కర్నూలు జిల్లా ఆదోనిలో మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ కూడలి వరకు ఈ ర్యాలీ జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు తీరు పట్ల వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలిలో బిల్లును అడ్డుకున్న ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలుకు హైకోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇదీ చూడండి: 'జగనన్న నాయకత్వంలో మూడు రాజధానులు తధ్యం'