కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని దొడ్డి గ్రామంలో తెదేపా వర్గీయుడు తాయన్న కుటుంబంపై వైకాపాకు చెందిన నరసన్నతోపాటు మరికొందరు దాడి చేశారు. తాయన్నతో పాటు భార్య, కుమారులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో నలుగురు కుటుంబసభ్యులు గాయపడ్డారు. కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్తుండగా.. అడ్డుకొని మళ్లీ దాడి చేశారని పేర్కొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలింంచారు.
ఇదీ చూడండి: ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాం: ఆళ్ల నాని