తాగునీటి కోసం కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రజలు రోడ్డెక్కారు. 15 రోజులుగా కుళాయిలకు నీళ్లు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు అభివృద్ధి కమిటీ అఖిలపక్ష ఆధ్వర్యంలో మహిళలు...... ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఏళ్లుగా తాగునీటి కోసం పోరాటాలు చేస్తున్నా.. తమను ఆదుకునే నాథుడు లేరంటూ బాధితులు వాపోయారు. పక్కనే తుంగభద్ర ఎల్.ఎల్.సీ కాలువ నుంచి నీరు పోతున్నా... తాగేందుకు నీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే... ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన నేపథ్యంలో రహదారిపై వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - womens
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 15 రోజులుగా కుళాయిలు నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు వాసులు.
తాగునీటి కోసం కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రజలు రోడ్డెక్కారు. 15 రోజులుగా కుళాయిలకు నీళ్లు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు అభివృద్ధి కమిటీ అఖిలపక్ష ఆధ్వర్యంలో మహిళలు...... ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఏళ్లుగా తాగునీటి కోసం పోరాటాలు చేస్తున్నా.. తమను ఆదుకునే నాథుడు లేరంటూ బాధితులు వాపోయారు. పక్కనే తుంగభద్ర ఎల్.ఎల్.సీ కాలువ నుంచి నీరు పోతున్నా... తాగేందుకు నీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే... ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన నేపథ్యంలో రహదారిపై వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది.
రేషన్ డీలర్ పై వైఎస్ఆర్సిపి నాయకుల దాడి.తాజా ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుండి వైసీపీ నాయకుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి.
తాజాగా ప్రకాశంజిల్లా దర్శిమండలం ఎర్రఓబనపల్లి రేషన్ డీలర్ పై అదే గ్రామంలోని వైఎస్సార్ పార్టీనాయకులు దాడి చేసి గాయపరచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘర్షణలో డీలర్ తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు. వివరాలలోకి వెళితే.....
దర్శి మండలంలోని ఎర్రఓబనపల్లి గ్రామంలో రేషన్ దుకాణం నిర్వహిస్తున్న తెదేపా కి చెందిన చింతా రమణారెడ్డి తన సోదరుడైన కోటేశ్వరరెడ్డి తో కలసి ద్విచక్ర వాహనం పై దర్శి నుండి ఎర్రఓబన పల్లి కి వస్త్తుండగా గ్రామ సమీపానికి రాగానే వైకాపాకి చెందిన సంజీవరెడ్డి మరి కొందరు కలసి ఇనుపరాడ్ల తో దాడి చేశారు.ఈ దాడి లో చింతా రమణారెడ్డి కి తలకు తీవ్ర గాయాలయ్యాయి.కోటేశ్వరరెడ్డి కి ముఖము పై గాయాలయ్యాయి.ప్రత్యర్ధుల పై ఎదురు దాడి చేయటంతో సంజీవరెడ్డి కి స్వల్ప గాయాలయ్యాయి . అనంతరం ఇరువర్గాలు దర్శి పోలీసు స్టేషన్ కు చేరుకొని ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.రమణా రెడ్డి కి అతని సోదరునికి తీవ్ర గాయాలవ్వటంతో దర్శి ప్రభుత్వాసుపత్రి లో ప్రథమ చికిత్సానంతరం ఇరువురిని ఒంగోలు రిమ్స్ కి తరలించారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. Body:.ప్రకాశంజిల్లా దర్శి.Conclusion:.కొండలరావు దర్శి 9848450509.