కర్నూలు జిల్లాలో ఓ యువతి అనుమానాస్పదం స్థితిలో మృతి చెందింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లి చెందిన సుంకన్న, అయ్యమ్మ దంపతుల కుమార్తె అరుణ బీటెక్ వరకు చదువుకుంది. అరుణకు అక్టోబర్ 27వ తేదీన సమీప బంధువుతో ఈనెల 27న నిశ్చితార్థం జరిగింది. పెండ్లి పనుల నిమిత్తం తల్లిదండ్రులు సోమవారం కర్నూలుకు వెళ్లారు.
హత్య చేశారు: తల్లిదండ్రులు
గాయాలైన ఆమెను ద్విచక్ర వాహనంపై వెంకటేశ్వర్లు అనే యువకుడు తీసుకుని వెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసులు ప్రశ్నించారు. అమ్మాయి మృతి చెందిందని గుర్తించిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెను వెంకటేశ్వర్లు అనే యువకుడు హత్య చేశాడని అరుణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
ROAD ACCIDENT: అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. నిద్రిస్తున్న వృద్ధుడు మృతి