ETV Bharat / state

నా సంతకం ఫోర్జరీ చేశారు.. అక్రమంగా నామినేషన్​ ఉపసంహరించారు!

తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా నామినేషన్​ ఉపసంహరించారంటూ.. కర్నూలు జిల్లాలో బండి విజయలక్ష్మి అనే మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్​ను ఆశ్రయించింది. న్యాయం చేయాలని అభ్యర్థించింది.

sarpanch candidate complained to kurnool collector
నా సంతకం ఫొర్జరీ చేశారు.. అక్రమంగా నామినేషన్​ ఉపసంహరించారు
author img

By

Published : Feb 9, 2021, 7:49 PM IST

తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించారంటూ కర్నూలు జిల్లాలో బండి విజయలక్ష్మీ అనే అభ్యర్థి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామానికి చెందిన బండి విజయలక్ష్మి సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. రెండవ విడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.

ఎన్నికల గుర్తు కోసం కార్యాలయానికి వెళితే నామినేషన్ ఉపసంహరణ చేసుకున్నట్లు అధికారులు తెలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉపసంహరణకు సంతకం చెయ్యకున్నా చేసినట్లు అధికారులు తెలిపారని.. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వీర పాండియన్​కు ఫిర్యాదు చేశామని తెలిపింది. తనకు న్యాయం చేయాలని భాదితురాలు కలెక్టర్​ను కోరింది.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో... పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.