కర్నూలు జిల్లా డోన్ మండలం బొంతిరళ్ల గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్జున్, లలిత దంపతులకు ముగ్గురు సంతానం. లలితకు చెవుడు ఉంది. ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గ్రామ సమీపంలో అనుమానాస్పద స్ధితిలో శవమై తేలింది. భార్య, భర్త తరుచు గొడవ పడేవారని గ్రామస్థులు తెలిపారు. భర్తే లలిత చావుకు కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం