ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 73,583 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జలాశయంలోని అన్ని రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుత నీటిమట్టం 884.200 అడుగులు కాగా... నీటినిల్వ 210.994 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్‌కు 30,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 15.226 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటర్‌కు 35,000 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: