ETV Bharat / state

గుడ్డు చిక్కింది.. పౌష్టికాహారం తగ్గింది!

ఐసీడీఎస్‌ ద్వారా అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులు అందించే పౌష్టికాహారంలో 50 గ్రాముల గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, గుత్తేదార్లు 30 గ్రాముల గుడ్లు సరఫరా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఫలితంగా బంగారు బాల్యం అనారోగ్యాల బారిన పడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటు కన్నెత్తి చూడటం లేదు.

under weight eggs distribution
గుడ్డు పంపిణీలో అక్రమాలు
author img

By

Published : Nov 4, 2020, 5:25 PM IST

సంపూర్ణ పౌష్టికాహారం అర్థం మారుతోంది. పోషక విలువలుండే గుడ్డు సైజు తగ్గి అసంపూర్ణ పౌష్టికాహారం అందుతోంది. ఫలితంగా చిన్నారులు బక్కచిక్కుతుండగా, గుత్తేదార్లు రూ.కోట్ల అక్రమార్జనతో లావైపోతున్నారు. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై సరఫరా చేయకుండా గుడ్లు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకుంటున్నారు. గుడ్లు సైతం నాణ్యత లేక లబ్ధిదారులకు చేరేసరికి కుళ్లిపోతున్నాయి.

జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, డోన్‌ నాలుగు డివిజన్లుగా చేసి నలుగురు గుత్తేదార్లకు గుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన గుత్తేదార్లకు మూడు డివిజన్లు కేటాయించగా, డోన్‌ డివిజన్‌ను స్థానిక గుత్తేదారు తీసుకున్నారు. మొత్తం జిల్లాలో ఐసీడీఎస్‌ పరిధిలో 16 ప్రాజెక్టులుండగా, 3,457 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటితోపాటు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 63 ఉన్నాయి. గుత్తేదార్లు ప్రతి నెలా 1.30 కోట్ల కోడి గుడ్లు కేంద్రాలకు సరఫరా చేస్తుంటారు.

ఇదేం గుడ్డు బాబోయ్‌!

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు చిన్న పరిణామంలో ఉంటున్నాయి. ఒక్కో అట్టలో(ట్రే) 30 గుడ్లు ఉంటే సగం చిన్నవే ఉంటున్నాయి. కొన్ని కేంద్రాలకు వచ్చే గుడ్లు 30 గ్రాముల బరువే ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో దొరికే గుడ్లతో పోల్చితే తక్కువ పరిమాణంలో ఉంటున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితమైతే మరీ చిన్న గుడ్లు గోళీల సైజులో వచ్చాయని గుర్తు చేసుకున్నారు. మరికొన్ని లబ్ధిదారులకు చేరేలోగా మురిగి పోయి దుర్వాసన వస్తున్నాయి.

కుమ్మక్కై మింగేస్తున్నారు

జిల్లాలో నెలకు సరఫరా అయ్యే గుడ్లకు సంబంధించి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలా చూస్తే ఏటా రూ.4.80 కోట్లు కేవలం గుడ్లకే చెల్లిస్తున్నారన్నమాట! నెక్‌ ధరతోపాటు, రవాణా ఛార్జీ కలిపి గుత్తేదార్లకు చెల్లిస్తున్నారు. గుత్తేదార్లు కర్ణాటక, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి చిన్న గుడ్లకు తక్కువ ధర చెల్లించి తెచ్చి జిల్లాలో సరఫరా చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి నెలకు 25 గుడ్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్రాల నిర్వాహకులతో గుత్తేదార్లు కుమ్మక్కై గుడ్లు సరఫరా చేయకుండానే చేసినట్లు సంతకాలు పెట్టించుకుని కొంత నగదు ముట్టజెబుతున్నారు. అందుకే టెండర్లు దక్కించుకునేందుకు గతంలో గుత్తేదార్లు తమ మద్దతుదార్లతో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే.

పంపిణీ చేస్తే బరువెక్కడ?

రెండేళ్ల పిల్లలు 10-11 కిలోల వరకు ఉండాలి. 3 ఏళ్ల పిల్లలు 12 కిలోలు, నాలుగేళ్ల పిల్లలు 13.50 కిలోలు, 5 ఏళ్ల పిల్లలు 14-15 కిలోల బరువు ఉండాలి. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి నెలా 25 గుడ్లు చిన్నారులకు పంపిణీ చేస్తున్నామని ఢంకా మోగిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆ పౌష్టికాహారం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా చిన్నారులు ఉండాల్సిన బరువు ఉండటం లేదు.

సెప్టెంబరులో చిన్న గుడ్లు సరఫరా అయినట్లు గుర్తించాం

సెప్టెంబరులో గుత్తేదార్లు చిన్న గుడ్లు సరఫరా చేసినట్లు గుర్తించాం. వాటికి బిల్లులు చెల్లించమని, కొత్త గుడ్లు తిరిగి సరఫరా చేయాలని సూచించాం. ఈ నెల 2వ తేదీ నుంచి మారుమూల కేంద్రాలకు సీడీపీవోలను పంపి గుడ్ల పరిమాణం తనిఖీలు చేయిస్తున్నాం. నేనే కొన్ని కేంద్రాలు తనిఖీ చేయాలని ప్రణాళిక చేస్తున్నా. - కె.ఎస్‌ భాగ్యరేఖ, ఐసీడీఎస్, ప్రాజెక్టు అధికారిణి

ఇదీ చదవండి:

కర్నూలు కలెక్టరేట్​ని ముట్టడించిన డీఈడీ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.