ETV Bharat / state

శ్రీశైలం సమీపంలో రెండు బస్సులు ఢీ.. ఇద్దరు మృతి - శ్రీశైలం వద్ద రోడ్డు ప్రమాదం

శ్రీశైలానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

two persons killed in an road accident takes place near srisailam,
ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు
author img

By

Published : Dec 4, 2019, 7:39 PM IST

శ్రీశైలం సమీపంలో... రెండు ఆర్టీసీ బస్సులు ఢీ

కర్నూలు జిల్లా శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలోని శిఖరం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో రాజమహేంద్రవరం, ధర్మవరం బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ధర్మవరం బస్సులోని ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత ధర్మవరం బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో పోలీసులు క్రమబద్ధీకరించారు. ఓ మృతురాలు సున్నిపెంట వాసిగా గుర్తించారు.

ఇదీ చదవండి

ఐదుగురు సహచరుల్ని బలిగొన్న జవాన్- ఎందుకు?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.