కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర రంగనాథస్వామి దేవాలయం రథోత్సవ జాతరలో విషాదం జరిగింది. వేడుకలో తేరు లాగుతుండగా విద్యుదాఘాతానికి గురై.. శివ (25), లక్ష్మన్న (28) మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్తులు తరలించారు.
విషయం తెలుసుకున్న మంత్రి జయరాం.. బాధిత కుటుంబీకులను పరామర్శించారు. లక్ష రూపాయల చొప్పున స్వయంగా సాయం అందించారు. ప్రభుత్వం నుంచి వైఎస్సార్ బీమాను.. బాధితులకు అందేలా చూస్తామన్నారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ అధికారులే వహించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు... రూ.55 లక్షలు స్వాధీనం