ETV Bharat / state

పదో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

author img

By

Published : Nov 30, 2020, 6:01 AM IST

Updated : Nov 30, 2020, 6:21 AM IST

కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు పదో రోజు వైభవంగా ముగిశాయి. కార్తిక పౌర్ణమితో పాటు వారాంతం కావటంతో... ఘాట్లలో భక్తుల సందడి కనిపించింది. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి తుంగభద్ర తల్లికి పూజలు చేశారు.

పదో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు
పదో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

ఒక వైపు కరోనా భయం, మరో వైపు తుపాను ప్రభావంతో 9 రోజులుగా ఘాట్లకు భక్తులు పెద్దగా రాలేదు. కార్తిక మాసం కావటం, ఆదివారం పౌర్ణమి రావటంతో అంతటి పవిత్రమైన రోజున నదీ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఘాట్లకు తరలివచ్చారు. మంత్రాలయం, సంకల్‌బాగ్‌ ఘాట్లలో భక్తుల సందడి నెలకొంది. మిగిలిన ఘాట్లకూ భక్తులు పెరిగారు.

పదో రోజు వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

సంకల్ బాగ్ పుష్కర ఘాట్​లో అనాథ బాలలకు పుష్కరభాగ్యాన్ని పోలీసులు కల్పించారు. ఉదయం నుంచి హోమం నిర్వహించారు. సాయంత్రం వేద పండితులు నదీమతల్లికి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని... పంచహారతి ఇచ్చారు. జన్మ, నామ, నక్షత్రాది దోషాలను తొలగించే నక్షత్ర హారతులు ఇచ్చారు. అనంతరం వేద పండితులు నదీ జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేసి వేదాశీస్సులు అందించారు.

కార్తిక సోమవారం పదకొండో రోజు సైతం భక్తులు భారీగా వస్తారని అధికారులు భావిస్తున్నారు. మంగళవారంతో పుష్కరాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి : జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన రేషన్: కొడాలి నాని

Last Updated : Nov 30, 2020, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.