శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ సిబ్బందిని దర్శనానికి అనుమతిస్తున్నట్టు ఈవో రామారావు తెలిపారు. 10వ తేదీ నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. విగ్రహాలను తాకకుండా... భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని కోరారు.
భక్తుల కోసం శానిటైజర్లను అందుబాటులో పెట్టామన్నారు. 10 నుంచి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఆన్లైన్లో ఉచిత టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. స్లాట్ పద్ధతిలో భక్తులకు టిక్కెట్లను మంజూరు చేయనున్నామని.. 10 స్లాట్లను దర్శనార్థం అందుబాటులో ఉంచామనీ వివరించారు.
ఇదీ చదవండి: