కర్నూలు జిల్లా మంత్రాలయంలో కిడ్నాప్ కలకలం రేపింది. కర్నాటకకు సురేంద్రశెట్టి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు రాయచూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి మరికొందరితో కలిసి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేశ్ శెట్టి అనే వ్యాపారి కొన్ని రోజుల క్రితం బాలాజీ అనే వ్యక్తి దగ్గర పెద్ద మెుత్తంలో అప్పు చేశాడు. అయితే కొద్ది రోజులుగా సురేశ్ ముఖం చాటేసి తిరుగుతున్నాడు. సురేశ్ మంత్రాలయంలో ఉన్నట్లు తెలుసుకున్న బాలాజీ.. స్నేహితులతో కలిసి దాడి చేసి కిడ్నాప్‌నకు యత్నించారు.
మంత్రాలయం ఎస్సై వేణుగోపాల్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని కిడ్నాప్‌నకు యత్నించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పోలీసులను చూసి పారిపోయారు. కారును సీజ్ చేసిన పోలీసులు..ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ యత్నానికి కారణమని వెల్లడించారు.
ఇదీ చదవండి: