కర్నూలు సమీపంలోని వెల్దుర్తి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి డోన్ వైపు వెళ్తున్న కారు ఆటోను ఢీకొట్టగా.. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతులు బేతంచర్ల మండలం మర్రికుంట గ్రామానికి చెందిన తిమ్మమ్మ (62) అయ్యస్వామి(40) కాగా.. మరొకరిని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి
కృష్ణా నదిలో యువకుడు గల్లంతు.. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు
ప్రాణం తీసిన పొలం గట్టు వివాదం.. మనస్థాపంతో యువతి ఆత్మహత్య !