కర్నూలు జిల్లా నంద్యాలలో సుబ్బరాయుడు అనే వృద్ధుడి వద్ద బంగారు గాజులను అపహరించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బండిఆత్మకూరు మండలం ఎర్రగుంట్లకు చెందిన సుబ్బరాయుడు బ్యాంకు రుణం కోసం ఈ నెల 17న నంద్యాలకు వెళ్లాడు. అక్కడే ఉన్న నంద్యాల సరస్వతీనగర్కు చెందిన రఫీ అనే వ్యక్తి.. మీ కుమారుడి స్నేహితుడినంటూ సుబ్బరాయుడును పరిచయం చేసుకున్నాడు.
వృద్ధునితో మాటలు కలిపి.. రుణానికి పెట్టే బంగారు గాజులను చూపెట్టమని రఫీ అడిగాడు. బాధితుడు నిరాకరించటంతో బలవంతంగా చేతిలో ఉన్న గాజులను లాక్కొని వెళ్లాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుణ్ని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి..