కర్నూలు నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. నగర పాలక సంస్థకు తానా, మహీంద్ర కంపెనీ విరాళంగా ఇచ్చిన చెత్తను తరలించే 2 వాహనాలను ఎమ్మెల్యేలు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలజీతో కలసి ప్రారంభించారు.
ఈ వాహనాలు ఇంటింటికి వెళ్లి తడిచెత్త, పొడిచెత్తను తీసుకొని నేరుగా డంప్ యార్డ్‌కి వెళ్తాయని కమిషనర్ తెలిపారు. ఈ విధానం విజయవంతం అయితే.. త్వరలోనే మరిన్ని వాహనాలను ఏర్పాటు చేసి నగరం మొత్తం చెత్తను తరలిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: