ఇదీ చూడండి:
ఎదురుగా ఉన్న బంగారాన్ని వదిలి.. డబ్బును దోచుకున్నారు - robbery news in chagalamarri
కర్నూలు జిల్లా చాగలమర్రిలో బుధవారం పట్టపగలే వరుసగా నాలుగు ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. చాగలమర్రిలో భూమానగర్లో షరీఫ్ దస్తగిరి, మహబూబ్ దస్తగిరి అనే వ్యక్తుల ఇళ్లల్లో ఈ చోరీ జరిగింది. వీరంతా తమ తోటలో పూలు కోసేందుకు వెళ్లగా... దొంగలు తలుపులు పగలగొట్టి బీరువాలోని నగదును దోచేశారు. బంగారు ఆభరణాలు కనపడుతున్నా.. వాటిని వదిలేసి నాలుగు ఇళ్లలో రెండు లక్షలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న ఇంఛార్జ్ సీఐ ఎన్.వి.రమణ చాగలమర్రి చేరుకొని దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. దొంగలు స్థానికులే అయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని చెప్పారు.
యాజమానురాలిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలీసులు