ETV Bharat / state

దేశవ్యాప్తంగా వామపక్షల సార్వత్రిక సమ్మె విజయవంతం - Left partys protested in ap

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... ప్రజా , రైతు వ్యతిరేక విధానాలను ఆపాలని ... సీపీఐ, సీపీఎం నాయకులు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రశాంతగా జరిగింది. ప్రజలపై భారం వేసే సంస్కరణలను నిలిపి వామపక్షాలు డిమాండ్ చేశాయి. వంద సంవత్సరాల పోరాటంతో సాధించుకున్న కార్మికుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవసాయరంగంలో మూడు చట్టాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు ఉందని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా వామపక్షల సార్వత్రిక సమ్మె విజయవంతం

author img

By

Published : Nov 26, 2020, 8:54 PM IST

Updated : Nov 26, 2020, 10:49 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ... సీపీఐ,సీపీఎం నాయకులు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రశాంతగా జరిగింది. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని వామపక్ష పార్టీల నేతలు ఆరోపించాయి.

పశ్చిమ గోదావరి జిల్లా ....

కేంద్ర ప్రభుత్వ... రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లిలో విజయవంతంగా జరిగింది. ప్రధాని మోదీ ప్రభుత్వం ఇష్టానుసారం జీవోలు తీసుకొస్తూ పేదలకు అన్యాయం చేస్తుందని సీపీఎం మండల కార్యదర్శి దుర్గా రావు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా పార్టీలతో నిరంతరం పోరాడుతామని అన్నారు. అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలే పేదల నడ్డి విరుస్తున్నాయి అని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ,సీఐటీయూ , భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . కేంద్ర భాజాపా ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటన గా దేశ వ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, కార్మిక చట్టాలను కాపాడాలని కోరుతూ ప్రదర్శన చేశారు.

కర్నూలు జిల్లా...

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మె కర్నూలులో ప్రశాంతగా జరిగింది . అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వామపక్ష నేతలు నినాదాలు చేశారు. అలాగే కేంద్రప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం చేస్తామని తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈక్రమంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా కర్నూలు జిల్లా మద్దికేరలో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆందోళనకారుల నిరసనతో భారీగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి .

ఆదోనిలో ఆందోళన...

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో పెద్ద ర్యాలీ చేపట్టారు .పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నుండి శ్రీనివాస్ భవన్ కూడలి వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్​), సీపీఎం, కాంగ్రెస్, కార్మిక సంఘాల ఈ ర్యాలీ పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా.....

కేంద్రం... కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో సీఐటియూ నాయకులు సమ్మె చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రజలపై భారం వేసే సంస్కరణలను నిలిపి వేయాలని కోరుతూ... పట్టణంలోని కళాజ్యోతి కూడలి వద్ద మనవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని వామపక్ష, ట్రేడ్ యూనియన్ల నేతలు విమర్శించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అనంతపురంలో కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. వంద సంవత్సరాల పోరాటంతో సాధించుకున్న కార్మికుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కార్పోరేట్ కంపెనీలకు ప్రయోగం చేకూర్చటానికి కార్మిక కోడ్ లు తీసుకొస్తోందని అన్నారు . ఓవైపు కార్మికులు లాక్ డౌన్ తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి అల్లాడుతుంటే, కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలిస్తోంది విమర్శించారు . రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవసాయరంగంలో మూడు చట్టాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజు ఉందని హెచ్చరించారు. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

రాస్తారోకో చేస్తున్న సీపీఐ నాయకుల అరెస్టు....

దేశం మొత్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా కళ్యాణదుర్గంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు రాస్తారోకో చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో సార్వత్రిక సమ్మెలో భాగంగా సిపిఐ నాయకులు కార్యకర్తలతోపాటు ఉదయం ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక టీ సర్కిల్లో రాస్తారోకో చేస్తుండగా పోలీసులు ఎక్కువసేపు చేస్తున్నారని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సిపిఐ నాయకులు వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకున్న సీపీ నాయకులను కొద్దిసేపు పోలీస్స్టేషన్లలో ఉంచుకొని అనంతరం విడుదల చేశారు.

కార్మిక చట్టాలను కేంద్రప్రభుత్వం తూట్లు పొడుస్తుందని... కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా చీరాల లో పలు కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రప్రభుత్వరంగ సంస్థలను కాపాడకండా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుందని వారు ఆరోపించారు.

మడకశిర పట్టణంలో సీఐటీయూ నిరసన ....

కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నేడు అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో సిఐటియు నిరసన తెలిపారు. రాజీవ్ గాంధీ కూడలిలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ రంగ సంస్థ రైల్వేలో 159 రైళ్లను... ప్రైవేటుకు అమ్మి.. పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి తదితర రంగాలను ప్రైవేట్ కు థారాదత్తం చేస్తోందని సీఐటియూ రాష్ట్ర కార్యదర్శి నరసింహయ్య ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం వీటిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లా.......

కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కార్మిక సంఘాల పిలుపుమేరకు విశాఖ పాడేరు మన్యంలో సార్వత్రిక సమ్మె ప్రశాంతంగా జరుగింది. పాడేరు ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక సంఘం కార్యదర్శి శంకర్రావు, మండల కార్యదర్శి సుందర్ రావు ఆధ్వర్యంలో విశాఖ ఏజెన్సీలో పని చేస్తున్నా అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెకు విశాఖలోని ఎల్.ఐ.సి. ఉద్యోగులు మద్దతు తెలిపారు. కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ ఉదయం నుంచి ఎల్.ఐ.సి. ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఎల్.ఐ.సి. ని ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం తీరును ఉద్యోగులు తప్పుబట్టారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బడా పెట్టుబడిదారులకు మోడీ సర్కారు కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం తన తీరును మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కేంద్రం అనుసరిస్తున్న అనాలోచిత విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలో కార్మిక సంఘాలు భారీ రాలీ నిర్వహించాయి. బీజేపీ ప్రభుత్వం సంస్కరణల ముసుగులో కార్పొరేట్లకు లబ్ది చేకూరే విధంగా చట్టాలకు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. స్థానిక డి.ఆర్.ఎం. కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మికులు భారీ రాలీ చేపట్టారు . మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విపక్షాలు అన్నీ ఏకతాటిపైకి రావాలని కార్మికులు కోరారు. ఈ ప్రదర్శనలో ఏఐటీయూసీ, సీఐటీయూసీ, కార్మిక సంఘాలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా.. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లోని కార్మికుల సంఘాలు ర్యాలీ, మానవహారం, నిరసనలు తెలిపారు. జోరువానలోను కార్మిక సంఘాలు కదంతొక్కాయి. పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా..

జాతీయ సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సమ్మె నిర్వహించారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కార్మికులు ప్రదర్శన చేపట్టారు . పలు బ్యాంకులు తపాలా శాఖ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు జరగటంతో లావాదేవీలు తక్కువగా జరిగాయి.

చిత్తూరు జిల్లా...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో ఏఐటీయూసీ, సీఐటియూ , ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయాల నుంచి నల్ల కాలము వరకు ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విలీనం పేరుతో కార్పొరేటర్లకు కొమ్ము కాస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ఉద్యోగుల వ్యతిరేక విధానాలను మార్చుకోవాలని పలికారు.

విజయనగరం జిల్లా....

దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి గరివిడిలో సీఐటియూ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. కరోనా కారణంగా కర్మాగారాలు పరిశ్రమలన్నీ మూతపడ్డాయని కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆ పార్టీ నేతలు అన్నారు. ప్రభుత్వము ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

కృష్ణా జిల్లా...

సీఐటీయూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పలు కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.పెనుగంచిప్రోలు పాత సినిమా హాలు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు అంగన్వాడి, ఆశ కార్యకర్తలతోపాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.21000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన కార్యకర్తలను సూపర్ వైజర్ గా నియమించాలని కోరారు. ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ,ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ పాలకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్​టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మానవహారం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక కోడ్ లు,రైతు వ్యతిరేక చట్టాల ఉపసంహరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. . సత్వరమే శాశ్వత ఉద్యోగులుగా తమను పరిగణించి పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు

గుంటూరు జిల్లా.......

కేంద్రప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు, రైతులు, ఉద్యోగ సంఘాలు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టాయి. ఇందులో భాగంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి లాడ్జి సెంటర్ ఆంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసిన ఆందోళన కారులు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. స్వదేశీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ.. విదేశీ పరిశ్రమలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచడంతోపాటు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

ఇదీ చదవండీ...నిరంకుశ పోకడలను అడ్డుకున్నప్పుడే రాజ్యాంగానికి ఔన్నత్యం: చంద్రబాబు

Last Updated : Nov 26, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.