కర్నూలు జిల్లా పగిడ్యాల మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని.. పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్నంబావి మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన 108 బాటిళ్లను కృష్ణా నది గుండా.. పుట్టిలో తీసుకువస్తుండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన వెంకటస్వామి, నరసింహుడు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లను అరెస్టు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ఇదీ చదవండి: