సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కర్నూలు జిల్లా నంద్యాలలో 'అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి' రిలే నిరాహారదీక్ష చేపట్టింది. మున్సిపల్ కార్యాలయ సమీపంలో.. ఆ సమితి నాయకులు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సలామ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
దీక్షా శిబిరాన్ని.. మాజీ మంత్రి ఫరూక్, కర్నూలు తెదేపా ఇంఛార్జి ప్రభాకర్ చౌదరి, నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి తదితర నాయకులు పరిశీలించారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: