కర్నూలులో రహదారులు దెబ్బతిని ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లను తెదేపా కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలెక్టరేట్ సమీపంలోనే రహదారులు దారుణంగా మారాయని అయినప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి