జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) ఆదేశాల మేరకు.. కృష్ణా బోర్డు బృందాన్ని రాయలసీమ ఎత్తిపోతల సందర్శనకు అనుమతించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. 'కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం-రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సమాలోచన' అనే అంశంపై.. కర్నూలులో జరిగిన సమావేశానికి పలువురు నేతలు హాజరయ్యారు. కృష్ణాబోర్డు, ఎన్టీటీకి సంబంధం లేకుండా రాయలసీమ లిప్టును ఎలా నిర్మిస్తారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు సహా 8 పార్లమెంటు కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి.. తిరుపతిలో రైతు సభ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, గాలేరు- నగరి, హంద్రీనీవా తదితర ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలని కోరారు.
ఇదీ చదవండి:
RAINS IN AGENCY: మన్యంలో భయంకర పరిస్థితి.. వాగు దాటేందుకు తీవ్ర కష్టాలు