పట్టణాల్లో అస్తిపన్ను చెల్లింపునకు మార్చి 31తో గడువు ముగుస్తుండటంతో పన్ను వసూళ్లపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాత్రి దాకా కౌంటర్లను తెరిచి ఉంచారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘంలో 75.60 శాతం పన్ను వసూలు చేసింది. బకాయి రూ.5.55 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.11.29 కోట్లు కలిపి రూ.16.84 కోట్లు వసూలు కావాల్సి ఉంది. వాటిలో 12.52 కోట్ల రూపాయలను అధికారులు వసూలు చేశారు.
రూ.11.29 కోట్ల లక్ష్యానికి రూ.9.93 కోట్లు వసూలు చేశారు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భవనాల పన్ను రూ.2.20 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
ఇదీ చదవండి: నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద భారీ అగ్నిప్రమాదం