ETV Bharat / state

పోటెత్తిన వరద... నిండు కుండలా సుంకేశుల - సుంకేశుల డ్యామ్ న్యూస్

ఎగువన కురుస్తున్న వర్షాలతో సుంకేశుల జలాశయానికి వరద పోటెత్తుతోంది. నెల రోజులుగా జలాశయంలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది సుంకేశుల జలాశయం.

sunkesula dam Completely filled with Flood

author img

By

Published : Jul 12, 2020, 6:32 PM IST

పోటెత్తిన వరద... నిండు కుండలా సుంకేశుల

కర్నూలుకు ప్రధాన తాగునీటి వనరు అయిన సుంకేశుల జలాశయం జలరాశితో కళకళలాడుతోంది. తుంగభద్ర పరీవాహకంలో భారీగా కురుస్తున్న వర్షాలతో నెల రోజులుగా జలాశయంలోకి నీరు వచ్చి చేరుతోంది. 1.2 టీఎంసీల సామర్థ్యం గల సుంకేశుల గరిష్ఠ స్థాయికి చేరింది. కర్నూలు నగరం సహా పలు గ్రామాలకు తాగునీరు సమృద్ధిగా లభించనుంది. తాగునీటితో పాటు కేసీ కెనాల్​కు నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సుంకేశుల పూర్తిస్థాయిలో నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

యువతి ప్రాణాన్ని బలిగొన్న మాస్క్ వివాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.