కర్నూలు జిల్లా ఆదోనిలోని టీజీఎల్ పాఠశాలకు 60 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో ఈ పాఠశాలలో ప్రతి ఏటా 1500 మంది విద్యార్థులు చదివేవారు. కొన్నేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఈ ఏడాది ప్రస్తుతం 73 మంది విద్యార్థులే మిగిలారు. 8,9 వ తరగతికి మాత్రం ఒక్కొక్క విద్యార్థే ఉన్నారు. వారికే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. అత్యధికంగా పదో తరగతిలోనే 35 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా 6,7,8,9 తరగతిలో విద్యార్థుల సంఖ్య 38 మంది. వారికి 14 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
యాజమాన్యం వైఖరి వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బడి మూసివేసి ఆధీనంలోకి తీసుకోవాలని యాజమాన్యం యోచిస్తుందని చెబుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు పూర్వ వైభవం తీసుకోవరాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి