శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లను గజవాహనంపై కొలువు దీర్చి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబదేవి మహా గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలలో భాగంగా నంది వాహనంపై ఆలయ ఊరేగింపు నిర్వహించనున్నారు.
స్వామి వారిని దర్శించిన మంత్రి:
మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వార్లకు మంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: వైభవంగా శరన్నవరాత్రులు.. మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం