కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.ఎస్ నాగిరెడ్డి సందర్శించారు. కొర్ర, శనగ, పత్తి, వరి తదితర పంటల పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. రకాల స్వభావాన్ని, దిగుబడుల శాతాన్ని శాస్త్రవేత్తలు ఆయనకు వివరించారు.
అనంతరం.. వైఎస్ఆర్ శతాబ్ధి భవన్లో సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి, శాసనసభ్యుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఏడీఆర్ మురళి కృష్ణ, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: