ETV Bharat / state

శ్రీశైల ఆలయ కుంభకోణంలో 27 మంది అరెస్ట్

author img

By

Published : Jun 2, 2020, 1:33 PM IST

Updated : Jun 2, 2020, 5:00 PM IST

శ్రీశైల క్షేత్రంలో ఇంటిదొంగలు ఎక్కువైపోయారు. ఏకంగా స్వామివారి ఖజానాకే కన్నం వేశారు.  శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతిని పోలీసులు ఛేదించారు. అక్రమాలకు పాల్పడిన మొత్తం 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.2.12 కోట్ల అవినీతి జరిగిందని డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. కంప్యూటర్ సాఫ్ట్​వేర్ ద్వారా అక్రమార్కులు సొమ్ము చేసుకున్నట్లు కనుగొన్నారు.

srisailam temple
srisailam temple

శ్రీశైల ఆలయ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. 2017 నుంచి 2020 వరకు... మూడేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు కాజేశారని గుర్తించారు. వీఐపీ అభిషేకం, డొనేషన్, ఆర్జిత సేవలు సహా 150 రూపాయల టిక్కెట్ కౌంటర్లలో... ఈ అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపగా.. దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో మరో కమిటీని నియమించారు. దీనిపై ఇప్పటికే అదనపు కమిషనర్.. విచారణ పూర్తిచేశారు. ఆయన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. డీఎస్పీ కమిటీ సమగ్ర విచారణ జరిపి కేసు వివరాలను తెలిపారు.

డీఎస్పీ వెంకట్రావు కమిటీ గత నెల 26వ తేదీన శ్రీశైలం చేరుకుని విచారణను ప్రారంభించింది. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారించింది. మొత్తం 27 మంది ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. 2 కోట్ల 12లక్షల రూపాయలను స్వాహా చేసినట్లుగా గుర్తించారు. గతంలో రెండు కేసులు, తాజాగా రెండు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీఐపీ అభిషేకం టిక్కెట్లలో 14 లక్షల రూపాయల అక్రమాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన కేసు నమోదు చేసి... నాగేశ్వరరావు అనే ఉద్యోగిని అరెస్టు చేశారు.

ఏప్రిల్ 15వ తేదీన... విరాళాల కేంద్రంలో జరిగిన 56 లక్షల రూపాయల అవినీతిపై... మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి అనే నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆర్జిత సేవలు, 150 రూపాయల కౌంటర్లో జరిగిన కోటీ 42 లక్షల రూపాయల అవినీతిపై... గత నెల 25వ తేదీన రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో మొత్తం 27 మందిని తాజాగా అరెస్టు చేసినట్లు వెంకట్రావు తెలిపారు.

కంప్యూటర్​లో సాఫ్ట్​వేర్​ ద్వారా అవినీతికి పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ వ్యవహారంలో... దర్శిల్లీ, రూపేష్ అనే నిందితులు కీలకంగా వ్యవహరించినట్లు తేల్చారు. శ్రీశైలం దేవస్థానం కంప్యూటర్లలో... టెంపుల్ మేనేజ్ సిస్టం, శ్రీశైలం మేనేజ్​మెంట్ ఇన్పర్మేషన్​ సిస్టం... అనే రెండు సాఫ్ట్​వేర్​లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా రీ ప్రింటింగ్, నకిలీ ఐడీలు క్రియేట్ చేయటం, షిప్ట్ బిఫోర్ క్లోజింగ్ చేయటం, లాగిన్ ఐడీని మార్చటం ద్వారా అవినీతికి పాల్పడినట్లు తేల్చారు. ఇప్పటికే... వీరి నుంచి 83 లక్షల 40 వేల రూపాయలు, 8 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. మిగిలిన సొమ్మును రికవరీ చేస్తామన్నారు.

అరెస్టు చేసిన వారిలో శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు, తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరిని కస్డడీకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. దీని ద్వారా దేవస్థానంలో జరిగిన అవినీతిపై... మరిన్ని విషయాలు బయటపడనున్నాయి. అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ కమిటీ నివేదిక ఇస్తే... మరికొందరి బండారం బట్టబయలు కానుంది.

ఇదీ చదవండి: సుధాకర్​ కేసులో పోలీసులను విచారించనున్న సీబీఐ

Last Updated : Jun 2, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.