ETV Bharat / state

PROJECTS : నిండుకుండలా జలాశయాలు.. శ్రీశైలం 4, పులిచింతల 9, సాగర్ 10 గేట్లు ఎత్తివేత - పులిచింతల జలాశయం

రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వరద ప్రవాహంతో ఇటు శ్రీశైలం, అటు పులిచింతల జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు శ్రీశైలం 4 గేట్లు, పులిచింతలలో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

PROJECTS
PROJECTS
author img

By

Published : Oct 11, 2021, 8:28 AM IST

Updated : Oct 11, 2021, 9:26 AM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు ఇవాళ 4 గేట్లను ఎత్తారు. స్పిల్ వే ద్వారా 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి శ్రీశైలానికి 1.71 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహిస్తోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటినిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసి 64,102 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

పులిచింతల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 4 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో లక్షా 91 వేల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల జలాశయం గరిష్ఠ నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 33.18 టీఎంసీలుగా ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతలకు వరద పెరిగే అవకాశముందన్న అధికారులు.. కృష్ణా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతుంది. నాగార్జునసాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 1,37,239 క్యూసెక్కులుగా ఉంటే.. ఔట్‌ఫ్లో 1,26,864 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తి 80,900 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులుకాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 311.74 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చదవండి: దసరా ఉత్సవాలు: నేడు అన్నపూర్ణా, మహాలక్ష్మీదేవి రూపాల్లో అమ్మవారు

Last Updated : Oct 11, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.