కర్నూలు జిల్లా అహోబిలం శ్రీలక్షీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దిగువ అహోబిలంలో స్వామివారు సింహవాహనంపై విహరిస్తూ అహోబిల మఠం చేరుకున్నారు. వేకువజామున హంస వాహనంపై కొలువుదీరారు. 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ మహాదేశికన్ స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామివారి వైభవాన్ని తిలకించడానికి భక్తులు పోటెత్తారు.
ఇదీ చదవండి: భాజే...భాజే.. ఆ తాడుతో డోల్ భాజేరే