ETV Bharat / state

రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్న సీఎం జగన్

author img

By

Published : Jul 4, 2022, 9:14 PM IST

Schools Reopen: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రేపు (మంగళవారం) పునఃప్రారంభం కానున్నాయి. అందుకు విద్యాశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను రేపటి నుంచి పంపిణీ చేయనున్నారు.

రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Jagananna Vidyakanuka Kits Distribution: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రేపు (మంగళవారం) తెరచుకోనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను రేపటి నుంచి పంపిణీ చేయనున్నారు. కిట్ల కోసం రూ.931.02 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్ధికీ దాదాపు రూ.2 వేలు విలువైన జగనన్న విద్యా కానుక అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యాకానుక కోసం మూడేళ్లలో ఇప్పటివరకు రూ.2,368.33 కోట్లు వ్యయం చేసినట్లు వివరించింది.

2018–19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్ధుల సంఖ్య ఇప్పుడు 7 లక్షలకు పైగా పెరిగారని ప్రభుత్వ సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరిందని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తెరిచిన రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్‌ అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం రూ.52,676.98 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలకు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

మన విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా దేశంలోనే అతి పెద్ద ఎడ్యూకేషనల్‌ టెక్‌ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ స్డడీ మెటీరియల్‌ ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉచితంగా అందించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 8 వ తరగతిలో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ.500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికీ దాదాపు రూ.12 వేల విలువ చేసే ట్యాబ్‌లను ఈ సెప్టెంబరులో ఉచితంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా ప్రతి క్లాస్‌ రూమ్‌లో టీవీ లేదా డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ముమ్మర ఏర్పాట్లు: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక మైదానంలో విద్యార్థులకు సీఎం జగన్ రేపు (శనివారం) విద్యకానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. అందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్ట్స్ కలశాల ప్రాంగణంలో హెలిపాడ్, మన్సిపల్ మైదానంలోని సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ కోటేశ్వర రావు, ఎస్పీ సిద్దార్థ్ పరిశీలించారు. జగన్ కాన్వాయ్​కు ట్రాఫిక్ అంతరాయం లేకుండా.. అధికారులు ట్రాఫిక్ మళ్లించే ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.