విజయనగరం జిల్లాలో...
విజయనగరం వాజీ ఛానల్ ఆధ్వర్యంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో పరిసర గ్రామాలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పల్లె వాతావరణం, తెలుగు సంస్క్రతి సంప్రదాయాలు, సంక్రాతి సంబరాలు, జాతి సమైక్యతను ప్రతిబింబిస్తూ మహిళలు ముగ్గులు వేశారు. సంక్రాంతి ప్రత్యేకత తెలిపే నవధాన్యాలు, గొబ్బెమ్మలు, సంక్రాంతి సూర్యుడు ముగ్గులు ఆకర్షణగా నిలిచాయి. వాజీ ఛానల్ ఎండీ శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
కర్నూలు జిల్లాలో...
సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలులోని ఏ.క్యాంపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులతో పాటు... సందేశాత్మక ముగ్గులను మహిళలు వేశారు. విజేతలకు కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ బహుమతులను అందజేశారు. నందికొట్కూరులో సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంక్రాంతి శోభ తలపించే విధంగా చెక్కభజన, బుడబుక్కల వంటి సాంప్రదాయ ఆటలను ఏర్పాటు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
కోనసీమ వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. మరో 24 గంటల్లో భోగి పండుగ ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా ముచ్చటగొలిపే మూడు పండగల కలయిక 'సంక్రాంతి' సందర్భంగా కోనసీమలోని వివిధ కళాశాలలు, పాఠశాలలు, సంఘాలు ముందస్తు వేడుకలు కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. ఆడపిల్లలు తెలుగు సంస్కృతిని చాటే విధంగా పట్టుపరికిణీలు ధరించి సంక్రాంతి పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు కనువిందు చేస్తున్నాయి.
ఇదీ చదవండి: