రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కృష్ణా జిల్లా తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు సంక్రాంతి శోభను ప్రతిబింబించాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుడివాడ ఇంజినీరింగ్ కళాశాలలోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
పశ్చిమగోదావరి జిల్లా
తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, పిండివంటల ఘుమఘుమలతో సంక్రాంతి శోభ ముందుగానే ప్రతిబింబించింది. మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
గుంటూరు జిల్లా
చిలకలూరిపేటలో పలు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పాటలకు నృత్యాలతో అలరించారు. రామదాసు భజనలు, హరిదాసు కీర్తనలు దేవతా మూర్తుల వేషధారణలతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.
నెల్లూరు జిల్లా
నాయుడుపేట నవోదయ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇదీ చదవండి: