కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని జగనన్న కాలనీలో.. కొందరు అక్రమార్కులు ఇసుక కోసం గోతులు తవ్వారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో యథేచ్చగా ఇసుకను తవ్వుతున్నారు. దీంతో జగనన్న కాలనీ అంతా గుంతలమయంగా మారింది. నీటి పైపులైన్లు పగిలిపోయాయి. ఓ వైపు జగన్ సర్కార్.. పేదలకు సొంతింటి కలను నేరవేర్చే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు కొందరు అక్రమార్కులు ఇసుకను తవ్వుతున్నారు.
దీంతో జగనన్న కాలనీల్లోని కొందరు లబ్ధిదారులు.. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేయగా.. ఆయన ఆ స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలించిన వారిపై అరా తీసి.. కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో తెలిపారు.
ఇదీ చదవండి:
Urea Problems: యూరియా కోసం రైతుల ఆవేదన.. గంటలకొద్దీ పడిగాపులు