ETV Bharat / state

బాలయ్య రికార్డు చెరిపేసిన రామ్​చరణ్ - 38ఏళ్లుగా అదే అతిపెద్దది - GAME CHANGER CUTOUT

విజయవాడలో బాలకృష్ణ కటౌట్ - ఆరోజుల్లోనే 108 అడుగులు

Balakrishna 108 Feet Cutout in Vijayawada
Balakrishna 108 Feet Cutout in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 12:02 PM IST

Balakrishna 108 Feet Cutout Record : విజయవాడలోని బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగులతో ఏర్పాటు చేసిన గేమ్‌ ఛేెంజర్ భారీ కటౌట్‌ ఎంతో ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దీనికన్నా ముందే 80వ దశకంలోనే దేశంలోనే అతిపెద్ద భారీ కటౌట్‌ ఏర్పాటు చేసి బెజవాడ వార్తల్లో నిలిచింది. సినిమాలన్నా, అభిమాన నటులన్నా ప్రాణాలిచ్చే విజయవాడ వాసులు 1986లో నందమూరి బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు చిత్రం విడుదల సందర్భంగా 108 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు.

అలంకార్ ధియేటర్‌ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భారీ కటౌట్‌ చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చేవారు. ఆ రోజుల్లోనే రూ.80వేలతో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏర్పాటు చేసిన గేమ్‌ ఛేంజర్ కటౌట్‌ ముందు వరకు బాలకృష్ణ కటౌటే అతిపెద్దగా రికార్డు ఉంది.

Balakrishna 108 Feet Cutout Record
అలంకార్ ధియేటర్‌ వద్ద ఏర్పాటు చేసిన బాలకృష్ణ కటౌట్ (ETV Bharat)

Ram Charan 256 Feet Cut Out : మరోవైపు రామ్​చరణ్ కటౌట్‌ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డును అందుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ కటౌట్​ను దిల్​రాజు ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా దీనిపై పూల వర్షం కురిపించారు. సినిమాలో రామ్‌చరణ్‌ నట విశ్వరూపాన్ని చూస్తారని తెలిపారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ​లో సినిమాకు సంబంధించిన భారీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్​లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.

దీనికి సంబంధించి త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసి చర్చిస్తామని దిల్​రాజు వివరించారు. చిరంజీవి ఈ సినిమా చూసి సంక్రాంతికి భారీ హిట్‌ ఖాయమని, అభిమానులకు ఈ విషయాన్ని చెప్పమని ఫోన్‌ చేసి మరీ చెప్పారని తెలిపారు. సినిమాలకు పుట్టినిల్లయిన విజయవాడలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. జనవరి 1న ట్రైలర్‌ను విడుదల చేస్తామని దిల్​రాజు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరయ్యారు.

వరల్డ్ రికార్డు సాధించిన రామ్‌ చరణ్ కటౌట్‌ - హెలికాప్టర్​తో పూల వర్షం

256 ఫీట్ల రామ్​చరణ్​ భారీ కటౌట్- మెగా ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.