ETV Bharat / state

పాత ఒప్పందాలు రద్దు! - ఇకపై అన్ని ఆలయాల్లో ఆ నెయ్యినే వాడాలి - VIJAYA GHEE ON TELANGANA TEMPLES

లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ

Laddus And Other Prasadams Preparing To Use Only Vijaya Ghee
Laddus And Other Prasadams Preparing To Use Only Vijaya Ghee (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 11:52 AM IST

Laddus And Other Prasadams Preparing To Use Only Vijaya Ghee : లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని దేవాలయాల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఆలయ ఈవోలను ఆదేశించింది. ఇందుకోసం ఇప్పటికే అమల్లో ఉన్న పలు ఒప్పందాలను సైతం రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ప్రసిద్ధ యాదగిరిగుట్ట సహా పలు దేవాలయాల్లో 2025 జనవరి 1 నుంచి ‘విజయ’ నెయ్యిని మాత్రమే లడ్డూలు, ఇతర ప్రసాదాల్లో వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే టీటీడీలో లడ్డూల తయారీకి వాడే నెయ్యి టెండర్ల విషయం తీవ్ర వివాదమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ స్పందించింది. ఇకపై ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘విజయ’ నెయ్యినే ఉపయోగించాలని ఆగస్టు 22నే ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ పలు దేవాలయాల్లో పాత గుత్తేదారుల నుంచే నెయ్యిని తీసుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలోనైతే ఏకంగా ప్రైవేటు డెయిరీకి కట్టబెట్టారు. ఈ ఘటనపై ‘భద్రాచలంలో నెయ్యి ప్రైవేటుకే’ శీర్షికన డిసెంబరు 16న ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది.

'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి' - తిరుమల కల్తీ నెయ్యిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

3 నెలల ముందే నిలిపివేత : అనంతరం భద్రాచలం ఆలయ ఈవోకు ఉన్నతాధికారులు మెమో జారీచేశారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కమిషనర్‌ శ్రీధర్‌ను దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యినే వాడాలని కమిషనర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని చాలా దేవాలయాలు 2025 మార్చి వరకు గడువుతో నెయ్యి సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే మూడు నెలల ముందే తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దుచేస్తున్నట్లు తెలిసింది.

ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2025 జనవరి 1 నుంచి నెయ్యి సరఫరా చేయాలని విజయ డెయిరీని ఈవో కోరారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్దఎత్తున పాలను సేకరిస్తున్న ఓ డెయిరీ దీర్ఘకాలంగా యాదగిరిగుట్టకి నెయ్యి సరఫరా చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. అయితే రెండు డెయిరీల నుంచి కూడా 50-50 శాతం చొప్పున తీసుకోవాలని దేవాదాయశాఖలోని ఓ కీలక అధికారి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ‘విజయ’ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశాలిచ్చినప్పటికీ కొందరు అధికారులు మాత్రం కొత్త ప్రతిపాదన తెస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు- ముప్పేట దాడికి దిగిన రాజకీయ పార్టీలు - Tirupati Laddu Ghee Issue

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు - నిర్ధారించిన NDDB - ల్యాబ్‌ రిపోర్ట్‌లో భయంకర నిజాలు - TTD GHEE ISSUE FACTS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.