కర్నూలు జిల్లా కోడుమూరు పెట్రోల్ బంకు వద్ద రహదారిపై ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణాపురం గ్రామానికి చెందిన గొల్ల మస్తాన్(39) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కృష్ణాపురం గ్రామానికి చెందిన మస్తాన్ గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పని నిమిత్తం సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై పాలకుర్తి గ్రామానికి వెళ్లాడు. పనిముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్రగాయం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. విషయం తెలుసుకున్న మస్తాన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: డ్రాగన్‌పై మంచుకొండల్లో ప్రత్యేక ఆపరేషన్?