కర్నూలు జిల్లా ఆదోనిలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వాహనాలపై తిరుగుతున్న వారికి ట్రాఫిక్ సీఐ లక్ష్మయ్య వినూత్నంగా చేతులు మొక్కి బయటికి రావద్దని కోరుతున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్న వేళ.. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చేతులు జోడించి చెబుతున్నారు. మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: