ETV Bharat / state

AP Crime News:ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు.. భారీ మొత్తంలో నగదు స్వాధీనం - Police arrested an online cricket betting gang

AP Crime News: కర్నూలు జిల్లా ఆదోనిలో ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 80 లక్షలు నగదు, కోటి రూపాయలు విలువ చేసే వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో భార్య అనుమానంతో కత్తి పీటతో నరికి హత్య చేశాడు. ఈ ఘటనలో అనకాపల్లి జిల్లా చోటు చేసుకుంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 13, 2023, 11:58 AM IST

ఆన్​లైన్ క్రికెట్ బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు

AP Crime News : కర్నూలు జిల్లా ఆదోనిలో ఆన్​లైన్ బెట్టింగ్‌ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్ననలుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 80 లక్షలు నగదు, కోటి రూపాయలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. బెట్టింగ్‌ దందా ఆన్​లైన్​ ద్వారా నడుస్తోందని పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారంగా ఆన్​లైన్​లో వెబ్​సైట్​ ద్వారా బెట్టింగ్ పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు చేసి బెట్టింగ్ పాల్పడుతున్న నలుగురిని అదుపులో తీసుకున్నామని అన్నారు. నిందితుల్లో బోయ మహానంది, ఖాసీం హుస్సేన్​తో పాటు తెలంగాణ రాష్ట్రం ఐజాకు చెందిన రాఘవేంద్ర చారి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

భార్యను హత్య చేసిన భర్త : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చీడిక గిరిజన గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కత్తి పీటతో నరికి హత్య చేశాడు. చీడిక గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన నాగేంద్ర వర్మతో పదేళ్ల క్రితం వివాహమైంది‌. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త నాగేంద్ర వర్మ ఆమెను శుక్రవారం రాత్రి అతి కిరాతకంగా కత్తిపీటతో తల నరికి హత్య చేశాడు. అనంతరం నాగేంద్ర వర్మ నక్కపల్లి పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు. జరిగిన సంఘటనపై నక్కపల్లి సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి : కడప శివారులోని స్వామి నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. చింతకొమ్మదిన్నె మండలం జేవీ నగర్​కు చెందిన కనటయ్య బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి ద్విచక్ర వాహనంలో పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా స్వామి నగర్ మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కనటయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అనాథలయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కడప నగరంలో ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగాయి. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ షరీఫ్ వెల్లడించారు.

గుర్తు తెలియని వాహనం ఢీ.. ఒకరు మృతి : విజయవాడ ప్రధాన రహదారిపై కొండిపర్రు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో చాట్లవానిపురం గ్రామానికి చెందిన జి.ఆశీర్వాదం (50) మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆశీర్వాదం అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం బంధువులు రోడ్డుపై బైఠాయించి మృతునికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని పామర్రు సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు నిరసన విరమించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.