ETV Bharat / state

'14 రోజులు దాటినా ఇంటికి పంపరేం?' - ఆళ్లగడ్డ క్వారంటైన్

తమను తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచి 14 రోజులు దాటుతున్నా ఇంకా ఇళ్లకు పంపించడం లేదంటూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ క్వారంటైన్‌లో ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారంటైన్‌ కేంద్రంలో అధికారులను ప్రశ్నించారు. పిల్లాపాపలతో 2 వారాలకు పైగా ఉన్నామని, అయినా బయటకు పంపకపోవడం దారుణమని వాపోయారు.

peple angry at who were stayed in allagadda quarantine
ఆళ్లగడ్డ క్వారంటైన్​లో బాధితుల ఆవేదన
author img

By

Published : Apr 14, 2020, 5:07 PM IST

తమను తీసుకొచ్చి 14 రోజులు దాటుతున్నా ఇళ్లకు పంపించడం లేదని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ క్వారంటైన్ కేంద్రంలో ఉన్నవారు అసహనం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి అక్కడకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వారూ, క్వారంటైన్‌లో ఉన్న మిగతావారూ ఒకే మరుగుదొడ్లను ఉపయోగించారని వైద్యులు తెలిపారు. ఈ కారణంగా మరో 14 రోజుల పాటు వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు. ఆళ్లగడ్డ క్వారంటైన్‌లో ఉన్న వారిని ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించి టెస్టింగ్‌ కిట్లు రాగానే పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో హామీ ఇచ్చారు. పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే ఇంటికి పంపిస్తామని తెలిపారు.

మమ్మల్ని పంపించేయండి

కర్నూలు జిల్లా మహానంది మండలం మహానందిఫారంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాలలోని రిలీఫ్‌ సెంటర్‌లో ఉంచిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన బాధితులతోపాటు మరికొందరు తమను ఇంటికి పంపించాలని అధికారులపై ఒత్తిడిని తీసుకువస్తున్నారు. ఇంటికి పంపకపోతే తమ కుటుంబాలకు వారైనా డబ్బు పంపించి ఆదుకోవాలని విన్నవించారు.

గుంటూరు నుంచి నందికొట్కూరు వచ్చిన వలస కూలీలను సోమవారం స్థానిక బీసీ వసతి గృహానికి తరలించారు. ఆదివారం స్థానికులకూ, కూలీలకు మధ్య వాగ్వాదం జరిగింది. వారిని మండలాల్లో ఉన్న క్వారంటైన్‌లకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోగా స్థానిక ప్రజలు ససేమిరా అనగా.. కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేసేది లేక స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో అధికారులు వారికి బస ఏర్పాటు చేసి అల్పాహారం, భోజనాలను ఏర్పాటు చేశారు. వారిలో కొందరికి జ్వరం ఉన్నట్లు వైద్య సిబ్బంది నిర్ధరించారు. క్వారంటైన్‌కు తరలింపు విషయమై కమిషనర్‌ అంకిరెడ్డితో మాట్లాడగా పగిడ్యాలలో ఉన్న క్వారంటైన్‌ను లక్ష్మాపురం గురుకుల పాఠశాలకు మార్చాలని ఉన్నతాధికారులతో చర్చించామని.. వారు తీసుకునే నిర్ణయం అనంతరం కూలీలను తరలించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఇవీ చదవండి:

తమలపాకు రైతుకు కరోనా దెబ్బ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.