పోలీసులంటే కఠినంగా ఉంటారు అనేది కేవలం అపోహే అని నిరూపించారు కర్నూలు జిల్లా ప్యాపిలి ఎస్సై. తన దుకాణంలో పనిచేసే గుమాస్తాకు కరోనా సోకిందనీ... తనకీ సోకే ఉంటుందని ఓ వ్యాపారి భయపడిపోయారు. కరోనా టెస్టులు చేయించుకొని ఇంటికి వచ్చిన తరువాత గుండెపోటు వచ్చి అతడు మరణించారు. అతనికి సైతం కరోనా ఉందేమోనని అనుమానంతో అంత్యక్రియలు చేయటానికి వారి తరఫు బంధువులు, సన్నిహితులు ముందుకు రాలేదు.
ఈ సమాచారం అందుకున్న ప్యాపిలి ఎస్సై మారుతి శంకర్... మృతుడికి అంత్యక్రియలు చేసేందుకు తనకు తానుగా ముందుకు వచ్చారు. మారుతి శంకర్ సహా ఐదుగురు పోలీసు సిబ్బందితో.. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎస్సై స్వయంగా ఆటో నడిపి.. దహన సంస్కారాలు నిర్వహించారు. కరోనా వచ్చిన వ్యక్తుల విషయంలో గానీ, అనుమానితుల పట్లగానీ వివక్ష చూపొద్దని ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: