ETV Bharat / state

'చిన్న వంతెనే కట్టలేకపోయారు.. మూడు రాజధానులు ఎలా..?' - కర్నూలులో జనసేన ర్యాలీ

ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో రెండో రోజూ పర్యటించిన ఆయన ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న కర్నూలు శివారులోని జోహరాపురం వంతెనను, నన్నూరు ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

pavan kalyan tours kurnool
కర్నూలు పర్యటనలో పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 13, 2020, 9:09 PM IST

కర్నూలులో పవన్ కల్యాణ్ పర్యటన

చిన్న వంతెనలే నిర్మించలేని వైకాపా సర్కారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రశ్నించారు. కర్నూలులో రెండో రోజు పర్యటించిన ఆయన.. జోహరాపురం వంతెనను పరిశీలించారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం సగంలో ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు పవన్​కు తెలిపారు. నిత్యం వేల మంది రాకపోకలు సాగించే ఈ మార్గంలో వంతెన నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పవన్ అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా.. గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి చర్యలతో ప్రజాధనం వృథా అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ గృహాలు పరిశీలన

జోహరాపురం నుంచి నన్నూరు వెళ్లిన పవన్... అక్కడ ఉన్న ఎన్టీఆర్ గృహాలను సందర్శించారు. గృహాలు లబ్ధిదారులకు ఎందుకివ్వలేదని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ గృహాలను లబ్ధిదారులకు అందచేసి.. తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.

చేనేత కార్మికులతో సమావేశం

అనంతరం ఎమ్మిగనూరులో పవన్ పర్యటించారు. చేనేత కార్మికులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వారి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ముగిసిన పర్యటన

పర్యటనలో మొదటి రోజు... కర్నూలులో నిర్వహించిన ర్యాలీలో పవన్ పాల్గొన్నారు. రెండు రోజు జోహరాపురం, ఎమ్మిగనూరులో పర్యటించారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని పవన్.. హైదరాబాద్​కు తిరుగుపయనమయ్యారు.

ఇదీ చదవండి:

వారికి న్యాయం చేయకపోతే నిరాహార దీక్ష చేస్తా: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.